పైలట్ తీరుతో ప్రయాణికులు షాక్...
- February 12, 2017
వాషింగ్టన్: ఎంతో జాగ్రత్తగా విమానం నడపాల్సిన పైలట్ మాటలు, నిర్లక్ష్యం చూసి ప్రయాణికులు కంగుతిన్నారు. బాబోయ్ ఈ పైలటా విమానం నడిపేది అని భయపడి గబగబా విమానం నుంచి కిందకు దిగిపోయారు. దీంతో అధికారులు వెంటనే పైలట్‌ను విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఆస్టిన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో సాధారణ దుస్తుల్లో వచ్చిన మహిళా పైలట్ విమానం ఎక్కి సిబ్బందితో గొడవకు దిగింది. ఆమె కూడా ప్రయాణికురాలు కావొచ్చు మిగతా ప్రయాణికులు అనుకున్నారు. తీరా ఆమె కాక్‌పిట్‌లోకి ప్రవేశించి పైలట్ స్థానంలో కూర్చోగానే షాక్‌కు గురయ్యారు.
అంతేకాకుండా ఆమె కాక్‌పిట్ నుంచి విమానంలోని వారితో మాట్లాడే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తాను ఈ డ్రెస్‌తోనే విమానం నడపొచ్చా.. లేదంటే యూనిఫాం వేసుకుని రావాలా అని ప్రయాణికుల అభిప్రాయం కూడా కోరారు. ఇంకా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. మీరు ఎవ్వరికైనా ఓటు వేసి ఉండొచ్చు.. కానీ ఇద్దరూ అబద్ధాల కోరులేనని గట్టిగా అరుస్తూ మాట్లాడారని విమాన ప్రయాణికుల్లో ఒకరు వెల్లడించారు. అంతకుముందు ఆమె ఎవరితోనో మాట్లాడుతూ తాను విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పిందట
పైలట్ మాటలు, ప్రవర్తనతో భయపడిపోయిన ప్రయాణికులు వెంటనే పైలట్‌ను మార్చాలని యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను కోరారు. ఆమె మానసిక స్థితి గురించి ఆందోళన చెంది దాదాపు 20 మంది వరకు విమానం నుంచి కిందకు దిగిపోయారు. దీంతో విమానయాన సంస్థ పైలట్‌ను తొలగించి వేరే పైలట్‌ను పంపించింది. ఘటనపై విచారణ చేపడతామని, పైలట్ సాధారణ దస్తుల్లో ఎలా విమానంలోకి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. అయితే సదరు పైలట్ వివరాలను మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







