నిషేధం వాలెంటైన్స్ డే వేడుకలపై...
- February 13, 2017
పాకిస్తాన్ : వాలెంటైన్ డే వేడుకలకు ఇప్పటికే యువత భారీ ఎత్తున్న ప్లాన్స్ వేసేసుకుని ఉంటారు. ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకుంటున్న వారికి ఇస్లామాబాద్ హైకోర్టు షాకిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధం విధిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇది ముస్లిం సంప్రదాయం కాదంటూ విచారణ సమయంలో పిటిషన్ దారుడు వాదించడంతో పాటు వెంటనే వీటిపై నిషేధం విధించాలని కోరారు. వారి వాదనలు విన్న కోర్టు వాలెంటైన్స్ డేకు సంబంధించిన వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. కార్యలయాలోనూ వీటిపై నిషేధ ఆంజ్ఞలు విధించింది.
లవ్ ను ప్రమోట్ చేసే విధంగా ఈ వేడుకలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు కూడా కవరేజ్ చేయకూడదని గట్టి ఆదేశాలు జారీచేసింది.
దీనిపై పదిరోజులోగా తమకు సమాధానం ఇవ్వాలని సమాచార మంత్రిత్వ శాఖ, ఫెడరల్ ప్రభుత్వం, ఫెమ్రా చైర్మన్, చీఫ్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. గతేడాదే అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ దేశంలో వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దంటూ గట్టిగా వారించారు. వాలంటైన్స్ డే పాకిస్థాన్ సంస్కృతి కాదని, దేశంలో ఎవరూ దానిని జరుపుకోవద్దని, నిషేధించాలని యువతకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు జరుపుకొంటారని, ముస్లిం మతస్థులు ఉన్న దేశంలో దానికి చోటులేదన్నారు.
తమ సంప్రదాయాలను, జాతి గుర్తింపును తప్పనిసరిగా పాటించాలన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







