ఖతార్ రోడ్లపై మరిన్ని మొబైల్ కెమెరాలు...
- February 13, 2017
దోహా: రహదార్లపై స్పీడ్ లిమిట్‌కి లోబడి వాహనాల్ని నడపాల్సి ఉంటుంది. ఇకపై అతి వేగంతో ప్రయాణించాలనుకుంటే మాత్రం ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అర్థ రాత్రి నుంచి మొబైల్ కెమెరాలను రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. ఖతార్‌లోని పలు రోడ్లపై వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించడం ఇంకా తేలికవుతుంది. అల్ ఖోర్ కోస్టల్ రోడ్, అల్ వక్రా రోడ్, అల్ రఫా స్ట్రీట్ వంటివాటిపై ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మొబైల్ కెమెరాల ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించేందుకు తగు చర్యలు చేపట్టింది. ఎక్కువగా ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్న రోడ్లపైకి ఈ మొబైల్ కెమెరాలను తరలిస్తారు. తద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







