'రోగ్'.. ఇది మరో చంటిగాడి ప్రేమకథ...
- February 14, 2017
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'రోగ్' అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఈ చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్ అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేమ కోసం తలకిందులుగా వేలాడే ప్రేమికులకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. పోస్టర్లో హీరో తలకిందులుగా వేలాడుతున్నారు. 'రోగ్' అనే టైటిల్ ఉన్న ఈ చిత్రానికి మరో చంటిగాడి ప్రేమకథ అనే ఉపశీర్షికను జత చేశారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







