విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో...
- February 14, 2017
చెన్నై: హరి దర్శకత్వంలోని 'సీ 3' చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రం హీరోగా 'సామి 2'ని తెరకెక్కించనున్నారు. దీని తర్వాత విజయ్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరి కూడా ఈ అంశంపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ''విజయ్‌తో సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆయనలాంటి మాస్ హీరోతో తీస్తే ఆ చిత్ర ఫలితమే వేరుగా ఉంటుంది. అందుకుతగ్గ నిర్మాత కావాలి. అప్పుడే నా ఆశ నెరవేరుతుంద''ని ఆయన చెప్పారు. తమ హీరో మాస్ ఇమేజ్‌కు హరి వేగమైన టేకింగ్ కలిస్తే తప్పకుండా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని విజయ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







