టాలీవుడ్ యంగ్ హీరో న్యూ లుక్‌తో సందడి చేస్తున్నరామ్...
- February 15, 2017
తన సినిమా విడుదలై నాలుగైదు నెలలు పూర్తవుతున్నా... ఇప్పటివరకు కొత్త సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు ఆ టాలీవుడ్ యంగ్ స్టార్. అయితే సినిమా కంటే ముందు తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడట ఆ కుర్ర హీరో. ఒకప్పుడు హీరోకు ఒక్క హిట్ పడితే... నాలుగైదు ఏళ్లు ఎలాగోలా గడిపోయేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. హిట్స్ కొట్టడంతో ఏ మాత్రం వెనుకబడిపోయినా... మిగతా హీరోలు వారిని ఓవర్ టేక్ చేసి ముందుకు సాగిపోతున్నారు. అందుకే తమ కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలామంది కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. గతేడాది 'నేను శైలజ' సినిమాతో రిలీఫ్ హిట్ అందుకున్న రామ్...
సెకండాఫ్‌లో వచ్చిన 'హైపర్' మూవీతో సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయలేకపోయాడు. దీనికి తోడు రామ్ మళ్లీ పాత బాటలోనే పయనిస్తున్నాడనే గుసగుసలు కూడా జోరందుకున్నాయి. దీంతో ఈ సారి తాను చేయబోయే సినిమా కాస్త కొత్తగా ఉండాలని భావిస్తున్న ఈ యంగ్ స్టార్... ఎవరి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాననే విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా...
తన లుక్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి రామ్ గెడ్డం చూసి... ఇదే మనోడి కొత్త సినిమా లుక్ అనే చర్చ సాగుతోంది. దీనికి తోడు ఈ సారి తన బాడీ లుక్‌ను కూడా మార్చుకునే పనిలో పడ్డాడు రామ్.
దీంతో ఈ సారి ఎనర్జిటిక్ స్టార్ సినిమా విభిన్నంగానే ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. 'నేను శైలజ' దర్శకుడు కిశోర్ తిరుమలతో రామ్ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తున్నా ఈ సినిమా కన్ ఫామ్ అయ్యిందా... ఈ మూవీలో రామ్ కొత్త లుక్‌లో కనిపిస్తాడా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. మరి రామ్ తదుపరి సినిమా వివరాల్ని ఎప్పుడు రివీల్ చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







