రానున్న 10 రోజుల పాటు ''డిజె'' షూటింగ్ దుబాయ్ లో జరుగనుంది
- February 26, 2017
ఇప్పుడు ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమా కొత్త టర్న్ తీసుకుంది. విజయవాడలో అన్నపూర్ణ క్యాటరింగ్ అంటూ ఒక అగ్రహారం వారి ప్యూర్ వెజిటేరియన్ క్యాటరింగ్ కంపెనీ నడుపుకునే శర్మ గారి పాత్రలో ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అయితే ఈ యువకుడు ఇప్పుడు తన పరివారంతో కలసి దుబాయ్ వెళ్తున్నాడు తెలుసా?
అవును.. రానున్న 10 రోజుల పాటు ''డిజె'' షూటింగ్ దుబాయ్ లో జరుగనుంది. గతంలో జులాయ్ వంటి సినిమాకు దుబాయ్ లో పాటలను షూట్ చేసిన బన్నీ.. దాదాపు ప్రతీ సినిమా కోసం బట్టల షాపింగ్ అక్కడే చేస్తాడు. లేటెస్టు ఫ్యాషన్లను అక్కడ నుండే దించుతాడు. అదంతా ఓకె. కాకపోతే ఇలా బ్రాహ్మణ క్యారెక్టర్ చేస్తున్న సినిమాకు దుబాయ్ లో ఏం పని అనుకుంటున్నారేమో.. సినిమాకు సంబంధించిన కీలకమైన ట్వీస్టు సీన్లన్నీ ఈ 10 రోజుల్లో అక్కడే తీస్తారట. దాదాపు మెయిన్ లీడ్స్ తో పాటు ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఈ షూట్ లో పాల్గొంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా కోసం హరీశ్ శంకర్ ఎన్నో పంచ్ డైలాగులు రాశాడట. అవన్నీ కూడా ట్రైలర్ లో పొందుపరుస్తురాట. అలాగే హీరోయన్ పూజా హెగ్డే కూడా గ్లామర్ గేట్లను తెరిచేసి నానా రచ్చ చేయబోతోందని మనకు టీజర్లో ఇచ్చిన హింట్ చూస్తే అర్ధమైపోతోందిలే.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







