దాలియా కిచిడీ అండ్ కర్డ్
- February 26, 2017
కావలసిన పదార్థాలు
గోధుమరవ్వ - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - ఒక కప్పు, నాలుగైదు రకాల కూరగాయలు - అరకేజీ, ఆవాలు, జీలకర్ర - ఒక్కో టీస్పూన్ చొప్పున, ఇంగువ - చిటికెడు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్న ముక్క, వెలుల్లి రెబ్బలు - ఆరు, కారం, పసుపు, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్ చొప్పున, నెయ్యి - రెండు టీస్పూన్లు, నీళ్లు - తొమ్మిది కప్పులు, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ విధానం
కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరగాలి.
కుక్కర్లో నెయ్యి వేడి చేశాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
ఉల్లిపాయలు వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి సన్నటి మంట మీద ఒక నిమిషం ఉంచాలి.
తరువాత తరిగిన కూరగాయలు, గోధుమరవ్వ, పెసరపప్పు వేసి, నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి.
మొదటి విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మంట ఎక్కువగా పెట్టాలి. తరువాత తగ్గించి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచి దింపాలి.
కొత్తిమీర, నెయ్యిలతో అలంకరించి వేడి వేడిగా తింటే యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







