అంతర్జాతీయంగా పసిడి మెరుపు పరుగు
- February 26, 2017
అంతర్జాతీయ సెంటిమెంట్ బాగుండడంతో పరుగు
న్యూఢిల్లీ/న్యూయార్క్: బంగారం శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా మళ్లీ పరుగులు పెట్టింది. ధర నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. అమెరికా నిరుద్యోగ రేటు పెరగడం, దీనితో ఫెడరల్ రిజర్వ్ రేటు (ఫెడ్ ఫండ్ రేటు) ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెంచడంపై అనుమానాలు, డాలర్ బలహీన ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు స్వల్పకాలంలో పసిడిని మార్గంగా ఎంచుకుంటున్నట్లు కనబడుతోంది.
న్యూయార్క్ కమోడిటీ మార్కెట్‌లో 24వ తేదీతో ముగిసిన వారంలో ధర ఔన్స్ (31.1గ్రా)కు 22 డాలర్లు ఎగసి, 1,257 డాలర్లకు చేరింది.
వరుసగా రెండు వారాలు (3, 10వ తేదీల్లో ముగిసిన వారాలు) ఔన్స్ (31.1గ్రా)కు 45 డాలర్లు పెరిగిన పసిడి ధర, తరువాతి వారంలో (17వ తేదీతో ముగిసిన వారంలో)మాత్రం 1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల అనిశ్చితే భవిష్యత్తులో పసిడికి మార్గదర్శకమని నిపుణులు భావిస్తున్నారు.
దేశీయంగా రూపాయి ఎఫెక్ట్...
దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉన్నా.... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో తగ్గింది. 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.29,455కు చేరింది. మరోవైపు వెండి కేజీ ధర స్థిరంగా రూ.43,255 వద్ద ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయంగా మెరుగుపడ్డం వల్ల అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగినా... ఇక్కడ ఈ ప్రభావం కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశీయ ప్రధాన ఫ్యూచర్స్ మర్కెట్- ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి 10 గ్రాముల ధర శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.29,623 వద్ద ముగిసింది. మరోవైపు ఢిల్లీలో మాత్రం పసిడి ధర దాదాపు రూ.300 ఎగసి నాలుగు వారాల గరిష్టస్థాయి... రూ.30,000పైకి చేరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







