ట్యూషన్ ఫీజు పెంచుకునేందుకు 30 పాఠశాలలకు మంత్రిత్వ శాఖ అనుమతి
- February 27, 2017
కతర్ : 30 కి పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరంలోవారి ట్యూషన్ ఫీజు పెంచుకోవడానికి విద్యా మంత్రిత్వ మరియు ఉన్నత విద్యాశాఖ అనుమతి మంజూరు చేసింది. కతర్ లో పాఠశాలల ఫీజు పెంచుకొనే అవకాశమున్నఆయా పాఠశాలలు జాబితాని ఈ సందర్భంగా విడుదల చేసింది. ఆ జాబితాలోఫిలిపినో ఇంటర్నేషనల్ స్కూల్, ఎస్ ఇ కె ఇంటర్నేషనల్, ఎం ఇ ఎస్ ఇండియన్ స్కూల్, ది ఫిన్నిష్ పాఠశాల మరియు దోహా కాలేజ్ (వెస్ట్ బే) ఉన్నాయి. అన్ని పాఠశాలలు 1 శాతం నుంచి 15 శాతం వరకు వారు తమ పాఠశాలలో ఫీజు పెంచుకునేందుకు అనుమతి లభించింది. అదే విధంగా కతర్ లో ఉన్న ప్రభుత్వ అనుమతి ఉన్న కిండర్ గార్డెన్ పాఠశాలలలో ఫీజు పెంచుకొనే అవకాశం ఉంది విద్యా మంత్రిత్వ శాఖ అనుమతి ఉన్నవి కేవలం 38 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. అలాగే అనుమతి లేని127 సంస్థలకు ఫీజులు పెంచుకునేందుకు వారిని అనుమతించబడరు, పాఠశాలల యాజమాన్యం బహుళ దశల ప్రక్రియ ద్వారా వెళ్ళడానికి అవసరం అని పేర్కొన్నారు. అటువంటి అభ్యర్ధనలు కోసం దరఖాస్తుదారులు గత ఏడాది 31 డిసెంబర్ 1 వ తేదీ నుండి మధ్య కాలంలో అన్ని పాఠశాలలు గత 4 సంవత్సరాల ఆర్థిక నివేదికలు మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంది. అపుడే వారు పాఠశాలలో ఫీజు పెంచాలని అనుమతించబడతారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







