సెన్సార్ క్లియర్ 'శరణం గచ్ఛామి'కి
- February 27, 2017
''మా 'శరణం గచ్ఛామి' చిత్రానికి రివైజింగ్ కమిటీ సోమవారం సెన్సార్‌ను నిర్వహించింది. మా సినిమా కంటెంట్‌కు ఇబ్బంది లేని విధంగా చిన్న చిన్న కట్లు చెప్పి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది'' అని ప్రేమ్‌రాజ్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'శరణం గచ్ఛామి'. బొమ్మకు క్రియేషన్స పతాకంపై బొమ్మకు మురళి నిర్మించారు. ఈ సినిమాను స్థానిక సెన్సార్ కమిటీ తిరస్కరించడంతో దర్శకనిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. నటి జీవిత ఆధ్వర్యంలో తొమ్మిది మందితో కూడిన కమిటీ ఈ చిత్రాన్ని వీక్షించారు. దీని గురించి ప్రేమ్‌రాజ్ 'చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ ''రివైజింగ్ కమిటీ మీద మొదటి నుంచీ మాకు నమ్మకం ఉంది.
చిత్రంలో కొన్ని చోట్ల పునరావృతమైన కులాల పేర్లని తీసేయమని కమిటీ సూచించింది. మరోచోట విలన ఓ అమ్మాయిని హత్యచేస్తూ జాతీయగీతాన్ని ఆలపిస్తాడు. అది భావ్యంగా లేదని చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న కట్స్ చెప్పి మాకు యు/ఎను ప్రకటించారు.
వారి సూచనల వల్ల మా సినిమా కంటెంట్‌కు ఎలాంటి ఇబ్బందీ రాలేదు'' అని అన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







