15 ఏళ్లు దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి
- February 27, 2017
15 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఆధార్ అప్డేట్ తప్పనిసరని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. 15 ఏళ్ల లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారు తిరిగి తమ ఆధార్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల వయస్సు లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు.
సామాజిక పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేసిన కారణంగా బయోమెట్రిక్ సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వృద్ధుల బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్‌ను పరిగణన లోకి తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు త్వరలో భీమ్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







