ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో అమెరికా కంపెనీలు తమ వద్ద ఉన్న విదేశీ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి
- March 01, 2017
అగ్ర రాజ్య అధినేత ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో అమెరికా కంపెనీలు తమ వద్ద ఉన్న విదేశీ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. అంతేకాకుండా విదేశీయులను నియమించుకున్నందుకు ప్రభుత్వానికి సవాలక్ష వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఆ కంపెనీలకు ఏర్పడ్డాయి. ట్రంప్ చేపట్టిన చర్యల్లో భాగంగా అమెరికాలోని కంపెనీల్లో నియామకాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. విదేశీయులకు హెచ్-1బీ వీసాలు ఇచ్చేందుకు కంపెనీలు ససేమిరా అంటున్నాయి. అంతేకాకుండా వివిధ కారణాలతో ఒక కంపెనీ నుంచి బయటికొచ్చిన ఉద్యోగికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. ముఖ్యంగా ట్రంప్ ఆదేశాలను పాటించేందుకు అన్ని కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకుని ప్రభుత్వంతో ఎందుకు విరోధం పెంచుకోవాలనే భావనతో కంపెనీ యాజమాన్యాలు ఉన్నాయి. మరోవైపు విదేశాల్లో కంపెనీలు పెట్టి అక్కడి నుంచి ప్రాజెక్టులు చేపట్టడాన్ని నిలిపివేయాలని కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పలు కంపెనీలు తమ ప్రాజెక్టులను వదిలేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







