ఆటకు గుడ్ బై చెప్పిన సారా
- March 01, 2017
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ సారా కాయ్టీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఆమె గుడ్‌బై చెప్పారు. సుమారు సంవత్సరం క్రితం నుంచి ఆమె క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా 25ఏళ్ల సారా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన కెరీర్లో మొత్తం 30వన్డేలు, 46 టీ20లు, నాలుగు టెస్టులు ఆడారు.
ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సభ్యులు ఆమె సేవలను కొనియాడారు. ఆమె అందించిన సేవలు మరువలేనివని బోర్డు సీఈవో జేమ్స్ సుదర్లాండ్ అన్నారు. ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సారా సభ్యురాలు.
2015లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆమె అద్భుత ప్రదర్శన కనపరిచారని జేమ్స్ గుర్తు చేసుకున్నారు.
సిడ్నీ వెళ్లి నా కుటుంబానికి దగ్గరవ్వాలని అనుకుంటున్నాను. ఆట వల్ల నా కుటుంబాన్ని ఎంత కోల్పోతున్నానన్న విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ఆడాలన్న ఆలోచన లేదు. మొత్తం సమయాన్ని నాకు, నన్ను ప్రేమించే వారికే కేటాయిస్తాను అని చెప్పింది సారా.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







