'నేనోరకం' అంటున్న143 హీరో
- March 01, 2017
పూరి దర్శకత్వం లో '143' చిత్రం తో హీరో గా పరిచయం అయినా పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ , హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. రెండేళ్ల ఓసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నప్పటికీ సక్సెస్ మాత్రం తలుపు తట్టడం లేదు. తాజాగా నేనోరకం అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబదించిన ట్రైలర్ ను రిలీజ్ చేసారు. టైటిల్ కు తగట్టే సాయి యాక్టింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ఆడియెన్స్ ను అలరించటంతొ పాటు , ఆలొచింపచెసెలా ,కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.
దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతుందని , సాయిరామ్ శంకర్ -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలగజేస్తాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు.
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







