ఇండోనేషియా చేరుకున్న సౌదీ రాజు సల్మాన్

- March 01, 2017 , by Maagulf
ఇండోనేషియా చేరుకున్న సౌదీ రాజు సల్మాన్

వెయ్యిమంది పరివారం.. మెర్సిడెస్ లిమోజిన్‌లు సహా 406 టన్నుల సరంజామాతో సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఇండోనేషియాలో కాలుమోపారు. జకార్తాలో 81 ఏళ్ల సల్మాన్‌ విమానం నుంచి ఎస్కులేటర్‌లో దిగారు. 47 ఏళ్లలో సౌదీ రాజు ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. సౌదీ మోనార్క్‌ రాక సందర్భంగా బొగొర్ ప్యాలస్‌లోని దిగంబర విగ్రహాలను వస్త్రాలతో కప్పారు. ఆయన ఓ మసీదును సందర్శించనున్న సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా వీఐపీ టాయ్‌లెట్ నిర్మించారు. 150 మంది వంటవాళ్లను నియమించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా పేరుగాంచిన ఇండోనేషియాతో ఆర్థిక సంబంధాల మెరుగు కోసం సల్మాన్ పర్యటిస్తున్నారు. జకార్తాలో సమావేశాల అనంతరం ఆయన బాలిలో కొన్ని రోజులు విడిది చేస్తారు. అక్కడ అయిదు లగ్జరీ హోటళ్లు సిద్ధం చేశారు. విమానాల్లో తరలించిన టన్నులకొద్దీ సామగ్రి ఇప్పటికే బాలి తరలించారు. సౌదీ రాజు జపాన్, చైనా, మాల్దీవుల్లో కూడా పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com