పాడైన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం
- March 01, 2017
ఓ వ్యక్తి పాడైపోయిన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. వారానికి మూడుసార్లు అబుదాబీ సిటీకి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. వైద్య చికిత్సకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్నా, ఉద్యోగం లేకపోవడంతో బతుకునీడ్చడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 47 ఏళ్ళ మొహమ్మద్ సలీమ్ కుటుంబం ఇండియాలో ఉంటోంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేస్తే, తిరిగి తాను పని చేయగలుగుతానని అయితే అందుకోసం ఇండియాలో ఖర్చు చేయలేక, యూఏఈలో చట్టాలు అనుకూలించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. అయితే త్వరలో రానున్న కొత్త చట్టం తనలో ఆశలు కల్పిస్తోందని, తద్వారా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోగలుగుతాననే విశ్వాసంతో ఉన్నాడు మొహమ్మద్. ప్రస్తుత చట్టాల ప్రకారం రక్త సంబంధీకులు మాత్రమే కిడ్నీ దానం చేయడానికి వీలవుతుంది. కొత్త చట్టం ప్రకారం యూఏఈలో నివసించేవారెవరైనా అక్కడ ఉంటున్నవారికి కిడ్నీ దానం చేయవచ్చు. యూఏఈలో 17 ఏళ్ళుగా ఏసీ టెక్నీషియన్‌గా పనిచేశాడు మొహమ్మద్. ఆరోగ్యం కుదుటపడితే ఉద్యోగం చేసుకుంటానని అంటున్నాడాయన.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







