అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు
- March 03, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమెరికా అల్లుళ్లకు భారత్లో మంచి గిరాకీ ఉంది. తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హెచ్1బీ వీసాలపై తీసుకువస్తున్న ఆంక్షలు, ఇమిగ్రేషన్ చట్టాలు అమెరికాలో ఉంటున్న భారత యువకులకు పెళ్లి యోగ్యతను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు డిమాండ్ పడిపోయింది. తాజాగా తెలుగు యువకులపై అమెరికాలో జరిగిన జాతి విద్వేష దాడి ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.
ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్తున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.
ట్రంప్ నిర్ణయాల వల్ల వలస వస్తున్న భారత టెకీలు ఉద్యోగాలు ప్రమాదంలో పడటమే కాకుండా వారికి వివాహం అయ్యే అవకాశాలను కూడా తగ్గిపోయేలా చేస్తున్నాయని హైదరాబాద్లో మ్యారేజ్ బ్యూరోను నడుపుతున్న దయాకర్ చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిల తల్లిదండ్రులు ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిల సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







