ఐపీఎల్ 2017 థీమ్ సాంగ్
- March 03, 2017
న్యూదిల్లీ: మరికొద్ది రోజుల్లో ఆరంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2017 కోసం రూపొందించిన థీమ్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సీజన్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దస్ సాల్ ఆప్కే నామ్’ టైటిల్‌తో పాటను రూపొందించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు సలీమ్-సులేమాన్ సంగీతం సమకూర్చగా బెన్నీ దాయల్ గానం అందించారు. సోనీమ్యాక్స్ ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. షేర్ చేసిన 48 గంటల్లోనే దాదాపు 25లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించడం విశేషం. థీమ్‌సాంగ్ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. పదో సీజన్ వచ్చే నెల 5న అట్టహాసంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







