కరుణాస్ ఆకస్మిక భేటీ సూపర్‌స్టార్‌తో
- March 03, 2017
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో గుణచిత్ర నటుడు, తిరువాడనై శాసనసభ్యుడు కరుణాస్ గురువారం ఆకస్మికంగా భేటీ అయ్యారు. శశికళ శిబిరానికి చెందిన ఆయన భేటీతో తమిళ రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలు మొదలయ్యాయి. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసానికి కరుణాస్ గురువారం వెళ్లారు. సుమారు అరగంట సేపు రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే రజనీకాంత్‌ను భాజపా తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని, ఆయన కూడా రాజకీయ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శశికళ శిబిరానికి చెందిన కరుణాస్ భేటీతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంచనాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా కరుణాస్ విలేకరులతో మాట్లాడుతూ రజనీకాంత్ హీరోగా నటించిన బాషా చిత్రం డిజిటలైజ్ చేసిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని, ఇందులో తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించలేదని తెలిపారు. రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని, తనంటే ఆయనకూ అభిమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు, తన కుటుంబానికి కొన్ని హితోపదేశాలు చేశారని తెలిపారు.
జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ న్యాయవిచారణ కోరడం అర్థరహితమన్నారు. ఇది ప్రజలను మోసపుచ్చే చర్య అని విమర్శించారు. ‘అమ్మ’ పాలన కాపాడాలని, ‘అమ్మ’ పథకాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







