అమెరికాలో మరో భారతీయుడి దారుణహత్య
- March 04, 2017
న్యూయార్క్: అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిబొట్ల దారుణహత్య విషాదం నుంచి భారతీయులు కోలుకోకముందే మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యారు. దక్షిణ కరోలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారవేత్తను గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి బయటే కాల్చిచంపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:24 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.
లాంకస్టెర్‌లో హర్నీష్ పటేల్ కుటుంబం నివాసం ఉంటోంది. దుండగులు సమీపం నుంచి కాల్పులు జరపడంతో 10 నిమిషాల వ్యవధిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాన్సాస్‌లో శ్వేతజాతి దుండగుడి జాతివివక్షతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల మరణించిన సంగతి తెలిసిందే.
శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించిన రెండు రోజుల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. కాగా జాతివివక్షతో పటేల్‌ను చంపి ఉండకపోవచ్చని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పటేల్ హత్యపై లాంకస్టెర్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉంది. అందరితో స్నేహంగా మెలుగుతూ ఇతరులకు సాయపడేవారు. లాంకస్టెర్ కౌంటీ షెరిఫ్‌కు దగ్గరలోనే ఆయన స్టోర్ ఉంది. పటేల్ గొప్ప వ్యక్తి, స్నేహితుడని కౌంటీ షెరిఫ్ బారీ ఫైలీ చెప్పారు. పటేల్ హత్యకు గురైన సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లో ఉన్నారు. స్థానికులు పటేల్ మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు. పటేల్ చాలా మంచివ్యక్తని, ఇలా జరుగుతుందని ఊహించలేదని స్థానికులు చెప్పారు. 'కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా స్టోర్‌ను కొన్ని రోజులు మూసివేశాం.. అసౌకర్యానికి క్షమించండి' అన్న బోర్డును పటేల్ స్టోర్ ముందు ఉంచారు.
హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం 'కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది' అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి 'తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి'
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







