ఉక్రెయిన్ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది
- March 04, 2017
- ఎనిమిది మంది కార్మికులు మృతి
కీవ్ : ఉక్రెయిన్ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సోకాల్ జిల్లా వివ్ ప్రాంతంలోని ఓ బొగ్గుగనిలో శుక్రవారం ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గుగనిలో 34 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గుగనిలో చిక్కుకున్న మిగతా కార్మికులను రక్షించేందుకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







