పోర్న్ మేగజైన్సే అతని ప్రాణాలు తీశాయి!
- March 04, 2017
జపాన్‌లో ఓ వ్యక్తికి వింత మరణం సంభవించింది. ఒకేసారి ఆరుటన్నుల పోర్న్ మ్యాగజైన్లు మీద పడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ముచ్చటపడి పోగుచేసుకున్న పోర్న్ పుస్తకాలే ఆయన ప్రాణాలు తీయడం గమనార్హం. కాగా, జపాన్‌కి చెందిన సదరు వ్యక్తి కుటుంబం ఈ విషయం దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుడికి 50 యేళ్లు ఉంటాయి. పుస్తకాలు దాచిన గదిలో.. ఓ మూల నుంచి మేగజైన్లు మొత్తం ఒకేసారి మీదపడడంతో అతడు మరణించాడు. శ్వాస ఆడక లేదా గుండెపోటు రావడం వల్ల చనిపోయిన ఉంటాడని భావిస్తున్నారు. జపాన్‌లోని అతని ప్లాట్‌లో ఈ ఘటన జరిగి ఆరు నెలల అవుతున్నా.. అధికారులకు కూడా తెలియలేదు.
అయితే, అతడి కుటుంబం ఈ ఘటనను తెలివిగా దాచే ప్రయత్నంచేసింది. కొందరు కూలీలను మాట్లాడుకుని గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ మేగజైన్లను తొలగించింది. అయితే చిందరవందరగా ఉన్న అపార్ట్‌మెంటు ఫోటోలు ఓ కూలీద్వారా బయటికి రావడంతో అసలు విషయం వెలుగుచూసింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







