ఏప్రిల్ 14న విడుదల కానున్న వరుణ్ తేజ్, శ్రీనువైట్ల మూవీ `మిస్టర్`
- March 12, 2017
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`. రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ - ``మిస్టర్ సినిమా ఏప్రిల్ 14న విడుదలకానుంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీ రికార్డింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. డైరెక్టర్‌గా `మిస్టర్` వంటి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మంచి ఎమోషన్స్‌కి, హిలేరియస్ ఎంటర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువల్స్‌కు స్కోప్ ఉన్న కథ. ఇప్పుడు రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. అవుట్‌పుట్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తీయగలిగాను. అందుకు నా నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. అందరూ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ట్రావెల్ ఫిలింలా ఉంటుంది. దాని కోసం స్పెయిన్‌లోని పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్ ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. మిక్కి జె.మేయర్‌తో ఫస్ట్ టైం పనిచేశాను. ఇందులో ఆరు పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. నిన్ననే ఫస్ట్ హాప్ రీరికార్డింగ్‌తో చూశాను. ఇన్ని వేరియేషన్స్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లొ చూపించడం కష్టం. మిక్కి అన్ బిలివబుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు`` అన్నారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్, ప్రిన్స్,నాజర్, మురళీశర్మ, తనికెళ్ళభరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు, హరీష్ ఉత్తమన్, నికితన్‌ధీర్, షఫీ, శ్రవణ్, మాస్టర్ భరత్, షేకింగ్ శేషు, ఈశ్వరిరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, స్టైలింగ్ః రూప వైట్ల, లిరిక్స్ః కె.కె, రామజోగయ్య శాస్త్రి, కోడైరెక్టర్స్ః బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ః కొత్తపల్లి మురళీకృష్ణ, కథః గోపీ మోహన్, మాటలుః శ్రీధర్ సీపాన, సంగీతంః మిక్కి జె.మేయర్, సినిమాటోగ్రఫీః కె.వి.గుహన్, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, నిర్మాతలుః నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శ్రీనువైట్ల.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







