హీరోగా మారనున్న అమలాపాల్ తమ్ముడు అభిజిత్ పాల్
- March 14, 2017
కేరళ కుట్టి అందాల తార అమలా పాల్ తమ్ముడు అభిజిత్ పాల్ కొన్ని సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించాడు.. తన అక్క అమలా పాల్ మోహన్ లాల్ తో కలిసి నటించిన "లైలా ఓ లైలా " మలయాళ సినిమా తో వెండి తెరపై అడుగు పెట్టిన అభిజిత్ కోలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.. ప్రభుదేవా నటించిన దేవా సినిమాలో ఓ పాత్రలో నటించిన అభిజిత్ తన నటనతో అందరినీ ఆకట్టుకొన్నాడు.. కాగా అభిజిత్ తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టునుంచి హీరో గా మారనున్నాడు.. హీరో విజయ్ శ్రీ పాటలు, విశ్రాంతి లేని ఓ స్పెషల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో హీరోగా అభిజిత్ హీరోగా నటించనున్నాడు.. కాగా ఈ సినిమా కాస్టింగ్ అండ్ క్రూ ఎంపిక చేసి త్వరలో ప్రకటించనున్నారు.. కాగా ఇప్పటి వరకూ హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకొన్న వారు ఉన్నారు కానీ హీరోయిన్ల తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు లేరనే చెప్పవచ్చు.. అలనాటి స్టార్ హీరోయిన్లు ఐన జయప్రద, రాధ వంటి హీరోయిన్ల తమ్ముళ్ళు వెండి తెరపై హీరోలుగా అడుగు పెట్టి.. ఒక్క సినిమాతోనే తెరమరుగయ్యారు.. మరి ఆ సంప్రదాయాన్ని అమలా పాల్ తమ్ముడు బీట్ చేసి స్టార్ హీరోగా ఏదుగుతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!







