సమస్యల్నే సరదాగా చెబుతుంటా దర్శకుడు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి

- March 14, 2017 , by Maagulf
సమస్యల్నే సరదాగా చెబుతుంటా దర్శకుడు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి

స మకాలీన సమస్యల నేపథ్యంలో కథల్ని అల్లుకొని వెండి తెరపై ఆవిష్కరించే దర్శకుడు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి. ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం ‘ఏటీఎమ్‌ వర్కింగ్‌’. పవన్‌, కారుణ్య, రాకేష్‌, ఆశ ప్రధాన పాత్రలు పోషించారు. కిశోరి బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మాతలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘నోట్లరద్దుతో ఏటీఎం దగ్గర క్యూలు పెరిగిపోయాయి. అక్కడ క్యూలో నిలబడిన రెండు జంటల మధ్య పుట్టిన ప్రేమకథ ఇది. సరదా సంఘటనలతో నడుస్తుంది. నల్లధనం వెలికితీత, బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు రహిత విధానం వల్ల కలిగే లాభాలను చర్చించాం.
సెన్సారు బోర్డు కొన్ని సవరణలు సూచించింది. రక్తదానం చేయడం వల్ల అవతలివారి ప్రాణం నిలిపిన వాళ్లమవుతాం. రక్తదానం వల్ల మన ఆరోగ్యానికీ మంచిదన్న విషయాలను కొన్ని సన్నివేశాల ద్వారా సినిమాలో చూపించామ’’న్నారు సునీల్‌కుమార్‌ రెడ్డి. ‘‘దినపత్రికల్లో ప్రచురితమబైన సంఘటనల ప్రేరణతోనే నా సినిమాల్ని తెరకెక్కిస్తాను.

‘గల్ఫ్‌’ కూడా అలాంటిదే. బ్రతుకు తెరువు కోసం పరాయి దేశాలకి వెళ్లిన ప్రవాస భారతీయుల సమస్యల నేపథ్యంలో సాగే ప్రేమకథ అది. చిత్రీకరణ పూర్తయింది. వేసవిలోనే విడుదల చేస్తాం.

నా చిత్రాల్లో సమస్యలొక్కటే కాదు, వాణిజ్యాంశాంలూ ఉంటాయి. సమస్యలనే సరదాగా చెబుతుంటా’’ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com