వరల్డ్ కిడ్నీ డే: కిడ్నీ బాధితుల్లో ఉత్సాహం నింపిన జులేకా హాస్పిటల్
- March 15, 2017
దుబాయ్: జులేకా హాస్సిటల్ మేనేజ్‌మెంట్, అలాగే పేషెంట్స్ ఫ్రెండ్స్ కమిటీ సంయుక్తంగా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, కిడ్నీ సమస్యలతో షార్జాలోని జులేకా హాస్పిటల్‌లో బాధపడుతున్నవారిని పరామర్శించారు. పేఝెంట్స్ ఫ్రెండ్స్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ జోదార్, దుబాయ్ పోలీస్ మెడికల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ రషీద్ అల్‌కాసిమ్‌తో కలిసి, జులేకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ వ్యాధి బాధితుల్ని పరామర్శించి, అక్కడ అందుతున్న సేవల్ని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. 2013 నుంచి పేషెంట్స్ ఫ్రెండ్స్ కమిటీతో కలిసి 200 మందికి పైగా పేషెంట్స్‌కి విజయవంతంగా డయాలసిస్ ట్రీట్‌మెంట్స్‌ని అందిస్తోంది. ఈ విభాగంలో జులేకా హాస్పిటల్ అత్యున్నత సేవలు అందిస్తోందని మొహమ్మద్ అబ్దుల్లా అల్ జోదార్ చెప్పారు. రోజువారీ డయాలసిస్ సేవలు అవసరమైనవారికి సైతం మంచి సేవలు అందుతున్నాయనీ, పేషెంట్లను చాలా జాగ్రత్తగా ఆసుపత్రి వర్గాలు చూసుకుంటున్నాయని ఆయన తెలిపారు. వందమలాదిమంది బాధితుల ప్రాణాల్ని కాపాడే అవకాశం రావడం గొప్ప విషయమనీ, ఈ విషయంలో పేషెంట్స్ ఫ్రెండ్స్ కమిటీతో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయమని జులేకా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తహెర్ షామ్స్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







