అదా ప్రదమాన్ పాయసం
- March 15, 2017కావలసిన పదార్థాలు: అటుకులు - 100 గ్రా, బెల్లం తరుగు - పావు కిలో, పల్చని కొబ్బరి పాలు - 5 కప్పులు, చిక్కని కొబ్బరి పాలు- 1 కప్పు, నెయ్యి-2 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, కొబ్బరి ముక్కలు - 2 టే.స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని
తయారీ విధానం:
బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి.
గిన్నెలో నీళ్లు వేడి చేసి మరిగాక మంట తీసి అటుకులు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత పల్చని కొబ్బరి పాలు పోసి కలిపి చిన్న మంట మీద అటుకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చిక్కబడ్డాక బెల్లం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించి తీయాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించు కోవాలి.
అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి మంట తీసేయాలి.
కొబ్బరి పాలు పోశాక ఉడికిస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పోసిన వెంటనే మంట తీసేయాలి.
దీన్లో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







