సుమంత్ హీరోగా చిత్రం, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో
- March 16, 2017
సుమంత్, ఆకాంక్ష సింఘ్ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ క్లాప్ నివ్వగా.., నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా గారి అమ్మ గారైన సావిత్రి గారు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్ (వెంకట్) యాదవ్, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది.
సుమంత్, ఆకాంక్ష సింఘ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్‌కుమార్, మిర్చి కిరణ్, అభినవ్, అప్పాజీ అంబరీష మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్, కెమెరా: సతీష్ ముత్యాల, ఆర్ట్: మురళీ, స్టిల్స్: రాజు, ఛీప్ కాస్ట్యూమర్: గోవింద్, మేకప్: మోహన్, మ్యూజిక్: శ్రవణ్, పి.ఆర్.ఓ.: బి.
వీరబాబు, మేనేజర్: వాసు, ప్రొడ్యూసర్: రాహుల్ యాదవ్ నక్కా, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గౌతం తిన్ననూరి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







