సిద్ధూకి ఉపముఖ్యమంత్రి పదవి ఊసే లేదు...!
- March 16, 2017
మాజీ స్టార్ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కేబినెట్ మంత్రిగానే ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మిగతా కేబినెట్ మంత్రులతో కలసి ప్రమాణం చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతేడాది బీజేపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆయన తొలుత ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సీఎం పదవి తనకు ముఖ్యం కాదని చెబుతూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. సిక్కులు అత్యధిక ప్రభావం గల పంజాబ్‌లో సిద్ధూ రాక కాంగ్రెస్‌కి బాగానే లాభించింది.
ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సహా మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్ నిరాశే ఎదురైనా... పంజాబ్‌లో మాత్రం భారీ మెజార్టీతో ఊరట లభించింది. తీరా తాజాగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవి అయినా ఇస్తారని అంతా భావించారు. కానీ ఆయన కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు.
ప్రమాణం అనంతరం సిద్ధూ ముఖ్యమంత్రి అమరీందర్ పాదాలకు వినమ్రంగా నమస్కరించాడు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగత ప్రాధమ్యాలు రెండోస్థానంలోకి వెళతాయనేందుకు సిద్ధూ ఇవాళ వేదికపై ప్రవర్తించిన తీరే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







