బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి ఆర్కేనగర్ రేసులో
- March 16, 2017
ఆర్కేనగర్ బైపోల్లో బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి
తెరవెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. అధికార అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్ పోటీ
చేస్తుండగా, అటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. డీఎంకే తన అభ్యర్థిని ప్రకటించింది. పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైంది. ఎలాగలేదన్నా అక్కడ చతుర్ముఖి పోటీ నెలకొనడం ఖాయం.
మరోవైపు జయ మృతిపై అనుమానాలను తొలగించాలంటే న్యాయవిచారణకు ఆదేశించాలని గౌతమి డిమాండ్ చేసిన
విషయం తెల్సిందే! ఈ విషయంలో ఆమె ప్రధానిని కలిశారు! ఈ నేపథ్యంలో ఆమెని బరిలో దింపాలని బీజేపీ నేతలు
భావిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరాదిన సాధించిన ఫలితాల ప్రభావం తమిళనాడుపై పడుతుందని, దీనికితోడు సినీ గ్లామర్ కూడా కొంతమేరా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇదిలావుండగా గౌతమి ఎన్నికల్లో పోటీ చేయలేదంటూ ఆమె ప్రతినిధి చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ డైలీ రాసుకొచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె, తనకు ప్రతినిధి ఎవరూ లేరని ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఈ లెక్కన గౌతమి ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది.
అన్నట్లు గతంలో బీజేపీ తరపున ఆమె పనిచేసింది కూడా!
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







