పవన్ సిఎం అవ్వనున్నాడా??
- March 18, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాటమరాయుడు ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అన్యాపదేశంగానైనా ఆయన రాజకీయాల ప్రసక్తి వచ్చింది. పవన్ కల్యాణ్ మాట్లాడే సమయంలో అభిమానులు కాబోయే సిఎం అంటూ నినాదాలు చేశారు.. దానికి పవన్ కల్యాణ్ స్పందించారు.
సినిమాలను తాను నిజాయితీతో చేశానని, ఏ పనైనా నిజాయితీతో చేస్తానని అంటూ భవిష్యత్తులో ఎన్ని బాధ్యతలు పెట్టినా నిజాయితీతో చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే అధికారం అంతిమ లక్ష్యం కాదని, ప్రజాసేవనే ముఖ్యమని ఆయన అన్నారు.
అది జరిగిందా మంచిది, జరగలేదా మరీ మంచిది అని కాబోయే సిఎం నినాదాలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. నీ బిడ్డలూ నా బిడ్డలు అని కాదు, అందరి బిడ్డలూ బాగుండాలని ఆయన అన్నారు. తాను జయాపజయాలను సమానంగా చూస్తానని ఆయన సినిమాలను ఉద్దేశించే అన్నప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తును ఉద్దేశించినవిగానే ఉన్నాయని అంటున్నారు.
వేడుకల్లో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా పరోక్షంగా పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఎవరో ఒకరు వచ్చి న్యాయం చేస్తాడని తన వైపు చూస్తుంటారని, అది చూసినప్పుడు తనకు బాధేస్తుందని, ఇంకా ఎవరో ఒకరు వచ్చి న్యాయం చేయాల్సిన స్థితిలో ప్రజలున్నారని పవన్ కల్యాణ్ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.
సినిమాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా పవన్ కల్యాణ్ మీకు దగ్గర కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ ఇతర మార్గాలు అనే దాన్ని ఆయన పవన్ కల్యాణ్ రాజకీయాలను ఉద్దేశించే అన్నారని అర్థమవుతోంది.
కాటమరాయుడు టైటిల్ పెట్టినప్పుడు తనకు నచ్చడానికి కారణం అది తన సినిమా అత్తారింటికి దారేదిలో ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలోని కదిరి నర్సింహుడు ఆ పాటలో వస్తాడని, అది తన సినిమాలో ఉందని, ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఉందని పవన్ కల్యాణ్ అనంతపురం సభలో అన్నారని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







