సునిల్ గ్రోవర్ చెంప చెల్లు మనిపించిన కపిల్ శర్మ
- March 19, 2017
ద కపిల్ శర్మ షో’లో సహ హాస్యనటుడు సునిల్ గ్రోవర్ పై కపిల్ శర్మ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. గత వారంలో వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా నుంచి ముంబై వస్తుండగా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ద కపిల్ శర్మ షో’ నిమిత్తం కపిల్ తన టీమ్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు విమానంలో కపిల్, సునిల్ కి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అందరూ చూస్తుండగానే తో కపిల్ అసభ్యంగా మాట్లాడిన సునిల్, అతనిపై దాడి చేశాడు. బాగా మద్యం సేవించి ఉన్న కపిల్ కేకలు వేస్తుండటంతో విమాన సిబ్బంది అతని చేతులు కట్టేసి మరీ, సీటులో కూర్చోబెట్టారు. సునిల్ తన పనిలో తానుండగా కపిల్ దాడి చేశాడని, అందరు చూస్తుండటాన్ని గమనించిన సునిల్ సైలెంట్ గా కూర్చుండిపోయాడని తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. కాగా, కపిల్, సునిల్ మంచిమిత్రులు. ‘కామెడి నైట్స్ విత్ కపిల్ షో’తో వాళ్లిద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







