మరో 'కత్తి'లాంటి కథతో ఇళయదళపతి విజయ్
- March 22, 2017
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయదళపతి విజయ్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తీసిన విజయ్ సినిమాలు అప్పట్లో తమిళనాడులో ప్రకంపణలు సృష్టించాయి. కత్తి సినిమాతో ప్రజలు ఎదుర్కుంటున్న నీరు సమస్యను ప్రశ్నించి ఆ సినిమా రిలీజ్ టైంలో ఇబ్బందులు పడ్డారు.
ఇక మరోసారి అలాంటి సోషల్ మెసేజ్ ఉన్న కథతో విజయ్ సినిమా చేస్తున్నాడట. విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను రాజు-రాణి, తెరి ఫేం అట్లీ డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజు రాణితో తన సత్తా చాటుకున్న అట్లీ విజయ్ ఇచ్చిన మొదటి అవకాశం తెరితో సూపర్ హిట్ చేసుకుని మరో అవకాశం అందుకున్నాడు.
ఇక ఈ కథ మరో కత్తి సినిమాగా ఉంటుందని టాక్.. సోషల్ మెసేజ్ తో వచ్చే సినిమాలకు జనాల్లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రజల్లో ఉండే సమస్యలను స్క్రీన్ మీద చూపించే సత్తా కొంతమందికే ఉంటుంది. ఆ దారిలో విజయ్ మరోసారి ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించబోతున్నాడు. కచ్చితంగా ఇది కూడా కత్తి లాంటి సూపర్ హిట్ సినిమా అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా మీద కోలీవుడ్ మీడియా ఫుల్ ఫోకస్ పెట్టేసింది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కమర్షియల్ గానే షోషల్ మెసేజ్ తో వచ్చే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









