షార్జాలో ఉచిత పార్కింగ్‌కి ముగింపు
- March 27, 2017
షార్జా అంతటా ఉచిత పార్కింగ్‌ని వచ్చే నెల నుంచి రద్దు చేయనున్నారు. షార్జా మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం వేళ అమల్లో ఉన్న ఉచిత పార్కింగ్‌ని ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెయిడ్ పార్కింగ్ అమల్లో ఉంటుంది శుక్రవారాలు, పెయిడ్ హాలిడేస్‌లో తప్ప. షాపింగ్ ప్రాంతాల్లో పార్కింగ్ స్లాట్స్ దుర్వినియోగమవుతుండడంతో రెసిడెంట్స్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సలీమ్ అల్ సువ్వాది చెప్పారు. వాహనదారులు తమ పార్కింగ్ ఫీజుని ఎస్ఎంఎస్ ద్వారా కూడా చెల్లించవచ్చునని డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ పార్కింగ్ అత్తిఫ్ అల్ జరౌని చెప్పారు. ఆరు నెలలు లేదా ఏడాదికి ఓ సారి సబ్స్క్రిప్షన్ చెల్లించాలనుకునేవారు మునిసిపాలిటీ కస్టమర్ సర్వీస్ సెంటర్స్‌ని సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







