జిటెక్స్‌లో రోజుకి 25,000 ఎఇడి విలువైన బహుమతులు
- March 27, 2017
జిటెక్స్ షాపర్ స్ప్రింగ్ ఎడిషన్ సందర్భంగా విజిటర్స్‌కి అద్భుతమైన బహుమతులు ఆహ్వానం పలుకుతున్నాయి. 1,500 అరబ్ ఎమిరేట్ దినార్స్ విలువైన షాపింగ్ చేసే విజిటర్స్, 25,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరిగే జిటెక్స్ షాపర్ స్ప్రింగ్ ఎడిషన్ కోసం అంతా సిద్ధమయ్యింది. జంబో, జాకీస్, ఇ-మ్యాక్స్, ప్లగ్ ఐఎన్‌ఎస్, షరాఫ్ డిజి సహా పలు సంస్థలు విజిటర్స్‌కి ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ ఈ షాపింగ్ బోనాంజాలో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 40 డెల్ ఇన్‌స్పిరాన్ ల్యాప్‌టాప్స్ గెలుచుకునే అవకాశం, జిటెక్స్ షాపర్ స్క్రాచ్ అండ్ విన్ రాఫల్, గ్రాండ్ ప్రైజ్‌గా టయోటా ఫార్చ్యూనర్ వాహనం వంటి చాలా బహుమతులు విజిటర్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. 35,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ విలువైన నాలుగు స్కాలర్ షిప్‌లు గెల్చుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తోంది జిటెక్స్. ఈ షాపింగ్ కోసం వచ్చేవారికి వీలుగా పార్కింగ్ సౌకర్యాన్ని షేక్ రషీద్ టవర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జిటెక్స్ షాపింగ్ కోసం టిక్కెట్ ధరని 25 అరబ్ ఎమిరేట్ దినార్స్‌గా నిర్ణయించారు.


తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







