హీరో నాని, దగ్గుపాటి రానాలు, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో
- April 01, 2017
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు లాస్ట్ సినిమా ఓం నమో వెంకటేశాయ అని అందరూ భావించారు.. కానీ ఐఫా వేడుకల్లో జీవన సాఫల్య అవార్డ్ అందుకొన్న రాఘవేంద్ర రావు.. తన నెక్స్ట్ సినిమా కోసం ఇద్దరు హీరోలతో అవును అనిపించుకొని తాను ఇంకా దర్శకత్వం కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు..
ఐఫా అవర్డ్ ఫంక్షన్ లో జీవన సాఫల్య అవార్డ్ అందజేసిన నాగార్జున మాట్లాడుతూ... " రాఘవేంద్రరావు ఇక సినిమాలు చేయరని నేనే పొరపాటున అన్నా. నా మాట అబద్దం కావాలి...అయన ఇలాగే సినిమాలు చేస్తుండాలి" అన్నారు.
వెంటనే స్పందించిన రాఘవేంద్ర రావు.. ఇక్కడున్న నాని, రానాలు నా సినిమాలో నటిస్తాను అని మాట ఇవ్వాలి అని అన్నారు.. అలా వారు నా సినిమాలో నటిస్తా అని మాట ఇస్తే.. నేను వాళ్ళతో సినిమా చెయ్యడానికి రెడీ అని అన్నారు. వెంటనే రానా, నాని ఒకే అని చెప్పారు. కాగా అవార్డ్స్ ఫంక్షన్ లో మాటలు కార్య రూపం దాలుస్తాయో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







