పాస్‌పోర్ట్ హోల్డర్ లేకుండా ఎస్కార్ట్ ప్రయాణానికి 'నో'
- April 04, 2017
పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, ఎస్కార్టుల ప్రయాణంపై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్ హోల్డర్ లేకుండా, ఎస్కార్ట్‌లు ప్రయాణం చేయడానికి వీల్లేదని తెలిపింది. సౌదీ పాస్‌పోర్టులపై ఎస్కార్ట్స్‌ని అదనంగా చేర్చడం కుదరదని పేర్కొంది పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్. ఈ విషయాన్ని పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ పాస్‌పోర్ట్ ఉండాల్సిందేననీ, ఒకే పాస్‌పోర్ట్‌పై పలువురు వ్యక్తులు ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ పోయినట్లయితే ఆ వ్యక్తితోపాటు ఎస్కార్ట్‌గా వెళ్ళినవారికీ సమస్య వస్తుందని, కాబట్టి విధిగా ఎస్కార్ట్‌లకూ పాస్‌పోర్ట్ ఉండాల్సిందేనని చెప్పారాయన. విదేశీ ప్రయాణాలకు సంబంధించి పౌరుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







