భారతీయులకు ఫ్రీగా వీసా మలేసియా కీలక నిర్ణయం
- April 04, 2017
మలేసియాకు వచ్చే భారతీయులకు ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వీసాలను మంజూరు చేయనున్నట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు.
ఇప్పటి వరకు ఏ మలేసియా ప్రధానీ భారత్ లో పర్యటించలేదు. దీంతో భారత్ లో పర్యటించిన తొలి మలేసియా ప్రధానిగా నజీబ్ రజాక్ రికార్డు సృష్టించినట్లయింది. తన పర్యటనలో భాగంగా భారత్ తో ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్, మలేసియా మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, భారతీయ భాషలను మాట్లాడేవారు మలేసియాలో ఎంతోమంది ఉన్నారని రజాక్ చెప్పారు. ఇక్కడి సంస్కృతి, ఆహారం మలేసియాలోని అన్ని ప్రాంతాల్లో మిళితమైందని తెలిపారు.
ఇక మీదట ఆన్ లైన్ ద్వారా భారతీయులు మలేసియా వీసా నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే, 48 గంటల్లోనే అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. తాను భారతీయ సినిమాలకు అభిమానిని పేర్కొన్నారు. భారత్ తో మరింత ద్వైపాక్షిక బంధాన్ని తాము కోరుకుంటున్నామని, విద్య, వైద్య, ఉగ్రవాద వ్యతిరేక, ఆహార భద్రత విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







