మరోసారి భయపెట్టనున్నలారెన్స్
- April 04, 2017
అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివలింగ`. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోసురక్ష్ ఎంటర్‌టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్, నిర్మాత రమేష్ పిళ్ళై పాత్రికేయులతో మాట్లాడారు.
మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. శివలింగ సినిమా చూశాను. చాలా బాగుంది.హార్రర్ సినిమాల్లో ఇది నెక్ట్స్ లెవెల్ లో ఉండే చిత్రమిది. తెలుగులో మా సురక్ష బ్యానర్ ద్వారా విడుదల చెస్తున్నాము.కాంచన, గంగ చిత్రాల సక్సెస్‌లతో లారెన్స్ నటనేంటో తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా వాసుగారి దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన శివలింగ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ కావడంతో తెలుగు, తమిళంలో లారెన్స్, రితిక సింగ్‌లపై అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పిళ్లై నిర్మించారు. రీసెంట్‌గా గురు చిత్రంతో సక్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని తెలిపారు. కన్నడలో శివలింగ పేరుతో శివరాజ్‌కుమార్‌గారు నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్, రితిక సింగ్‌లతో రీమేక్ చేశాం. వాసుగారి దర్శకత్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌గారికి కాంచన కంటే మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని అభిషేక్ ఫిలింస్ అధినేత రమేష్ పిళ్ళై చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







