దటీజ్ మెగాస్టార్ చిరంజీవి..!
- April 06, 2017
తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా వెలిగిపోయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్పస్థానం ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సొంతం చేసుకున్నారు. అప్పట్లో సీనియర్ హీరోలతో పోటీగా నిలిచి తెలుగు ఇండస్ట్రీకి డ్యాన్స్, ఫైట్స్ లో ఎన్నో ప్రయోగాలు చేసి తనదైన మార్క్ సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన గొప్ప నటులు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన బాటలో ఇప్పుడు ఎంతో మంది మెగా హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు.
ఇక హీరోగా మంచి ఫామ్ లో ఉన్న చిరు 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించారు.
ఒకప్పుడు 'ఠాగూర్' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రిమేక్ గా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' రిలీజ్ అయిన మొదటి రోజే రికార్డుల మోత మోగించింది.
ఈ మద్య ఇండస్ట్రీలో వారం , రెండు వారాలు ఆడటమే గగనమై పోతున్న ఈ రోజుల్లో వంద రోజులను పూర్తిచేసుకోవడం పెద్ద విశేషమే మరి , అందునా 50 కేంద్రాల్లో 100 రోజులు అంటే ఇంకా గగనం అలాంటి అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . సంక్రాంతి బరిలో జనవరిలో రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 చిత్రం భారీ వసూళ్ళ ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించి సంచలనం సృష్టించింది.
వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికి రీలీజ్ అయి 86 రోజులు దాంతో మరో రెండు వారాలు ఆగితే యాభై సెంటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంటుంది. మొత్తానికి ఈ రెండు వారాలు పూర్తి చేసుకుంటే చిరంజీవి ఖాతలో మరో అరుదైన రికార్డు ఖాయం అవుతుందని అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







