దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు
- April 07, 2017
దుబాయ్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రవేవపెట్టింది. లింక్డిన్, ఓరాకిల్ సంస్థలతో కలిసి ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దుబాయ్ స్మార్ట్ ఆఫీసు ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీనికి దుబాయ్ కెరీర్స్ పోర్టల్ అని పేరు పెట్టారు. ఇందులో నిరుద్యోగులు తమ బయోడేటాను నమోదు చేసుకోవచ్చని తమకు అవసరమైన ప్రతిభ ఎవరిలో ఉంటే వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు అంటున్నారు. వాటితో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నారు. ప్రతిభగల నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు దుబాయ్ స్మార్ట్ ఆఫీస్ డైరక్టర్ ఐషా బిన్త్ బుటీ బిన్ బషర్ అన్నారు. అందులో భాగంగానే ప్రతిభ గల నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. dubaicareers.ae అడ్రస్‌లో లాగిన్ అయి, తమకు కావలిసిన జాబ్స్‌కి అప్లయ్ చేసుకోవచ్చని, అందులో రకరకాల జాబ్ పోర్టల్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. 30 వరకు ప్రభుత్వ సంస్థలు అందులో ఉన్నాయన్నారు. వాటిలో 600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







