మూడేళ్ల జైలు సినీ నటిని మోసం చేసిన ఇద్దరికి
- April 07, 2017
రంగారెడ్డిజిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఓ సినీ నటిని ప్రేమిస్తున్నానని నమ్మబలికి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన దర్శకుడు, అతడి సోదరుడికి న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది.ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున జరిమానా కూడా విధిస్తూ జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పీపీ టీవీప్రసాద్ కథనం ప్రకారం.. కడపకు చెందిన ఐ.సురేష్ అలియాస్ సురేష్‌కృష్ణ కూకట్‌పల్లిలోని భాగ్యనగర్‌కాలనీలో ఉంటూ సినిమాలకు దర్శకత్వం చేస్తుంటాడు. ఇతడు 2012లో ఓ సినిమాకు పని చేస్తున్నప్పుడు సినీ నటి(25)ని ప్రేమిస్తున్నట్లు నమ్మించి సహజీవనం చేశాడు. ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
చివరికి పెళ్లి చేసుకోనేందుకు నిరాకరించాడు. 2012 సెప్టెంబరు 29న సురేష్ తన సోదరుడు సతీష్ మరో స్నేహితుడు బుజ్జీతో కలసి ఆమెను కారులో అపహరించుకుపోతుండగా స్థానికులు అడ్డగించడంతో వదిలిపెట్టి వారు పారిపోయారు. కోర్టు ఇద్దరికి అపహరణ నేరం కింద శిక్షవిధిస్తూ మిగతా అభియోగాలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







