అమెరికాలో మరో ఘోరం భారతీయుడ్ని కాల్చి చంపారు
- April 07, 2017
అమెరికాలో మరో ఘోరం జరిగింది. మరో భారతీయుడ్ని కాల్చి చంపేశారు. 26 ఏళ్ల విక్రమ్ జర్యాల్ అనే యువకుడ్ని పొట్టన పొట్టుకున్నారు. యకిమా సిటీలో ఏఎమ్-పీఎమ్ అనే గ్యాస్ స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు విక్రమ్ జర్యాల్.
ఆయుధాలతో గ్యాస్ స్టేషన్‌కి వచ్చిన ఇద్దరు దుండగులు, విక్రమ్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కౌంటర్‌లోవున్న నగదు ఇచ్చాక విక్రమ్‌పై కాల్పులు జరిపారు. గాయాలతో బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
విక్రమ్ సొంతూరు పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా.
గతనెల ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు.. ఇంతలోనే ఇలా జరగడం ఫ్యామిలీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన తెలుసుకున్న అక్కడ భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది జాత్యహంకార దాడేనని ఆరోపిస్తున్నారు.
విక్రమ్ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. హత్యను ఖండించిన సుష్మ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







