స్మార్ట్ కార్ల పరీక్షల కోసం రెండు డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభం
- April 07, 2017
పారదర్శకతతో కూడిన అత్యున్నత ప్రమాణాలను అభివృద్ పర్చడానికి ఎవరైతే డ్రైవింగ్ పరీక్షలలో విఫలం చెందారో వారు తీసుకొన్న శిక్షణ గూర్చి ఫిర్యాదులను నివారించడానికి స్మార్ట్ కార్ల డ్రైవింగ్ పాఠశాలలను కొన్ని చోట్ల పరిచయం చేయనున్నారు. ట్రాఫిక్ విభాగంకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు. "మేము ఇప్పటికే పరిచయం చేయడమే కాక రెండు పాఠశాలలలో స్మార్ట్ కార్లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటిలో డాల్లహ్ డ్రైవింగ్ అకాడమీ ఉంది. త్వరలో డ్రైవర్లు తమ వాహనాలను సమర్ధవంతంగా నైపుణ్యాలను పెంపొందించుకొనేలా ఈ స్మార్ట్ కార్లను అలాగే ఇతర డ్రైవింగ్ పాఠశాలలో పరిచయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మా లక్ష్యం ఏమిటంటే,గతంలో మాదిరిగా శిక్షణ పూర్తయిన తర్వాత ఫిర్యాదులు చేయడానికి అవకాశాలు లేకుండా ప్రజలకు మా సేవలను అభివృద్ధి పర్చడమేనని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ సాద్ అల్ ఖర్జీ చెప్పారు. ఈ విధానం వలన దరఖాస్తుదారునికి మరియు పరిశీలకుడు మధ్య ప్రత్యక్ష పరిచయంను నిరోధిస్తుంది. అన్ని డ్రైవింగ్ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడతాయి. పార్కింగ్ మరియు వాహనాలను తప్పించే తదితర పరీక్షలు నేర్చుకొంటారు. ఇతరులు సైతం ఈ కొత్త స్మార్ట్ కార్ల శిక్షణ చేపట్టారు. ఈ ఆధునిక ప్రక్రియలో భాగంగా స్మార్ట్ వాహనాలు ద్వారా డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించే కొత్త పథకంను అన్ని డ్రైవింగ్ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు అల్ ఖర్జీ పేర్కొన్నారు. కెమెరాల సహాయంతో ట్రాఫిక్ విభాగ విధానంతో శిక్షకుడు వాహనాన్ని నడిపే సమయంలో నేరుగా ఫలితాలు రికార్డ్ చేయడానికి ఈ స్మార్ట్ కార్లు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డ్రైవింగ్ పరీక్షలు కోసం కొత్తగా పరిచయం కాబడుతున్న ఈ "స్మార్ట్ కార్లు" పర్యవేక్షక పోలీసుల జోక్యం లేకుండా ఫలితాలను నేరుగా నిస్పక్షపాతంగా నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







