పూరి చిరు ల కొత్తసినిమా జనగణమన
- April 08, 2017
ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి అసలైతే 150వ సినిమాగా పూరి దర్శకత్వంలో ఆటో జాని సినిమా చేయాలి.. మొదటి భాగం అదరగొట్టిన పూరి సెకండ్ హాఫ్ బాగా నేరేట్ చేయలేదని ఆ సినిమా ఆపేశారు. ఇక కత్తి రీమేక్ తో కత్తిలాంటి హిట్ కొట్టాడు అనుకోండి.
ప్రస్తుతం పూరి దగ్గరున్న జనగణమన స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించాడట పూరి. ఫ్లాపుల్లో ఉన్నా స్టార్ హీరోల అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు డైరక్టర్ పూరి. రోగ్ ఫ్లాప్ తో మళ్లీ అపవాదాలు ఫేస్ చేస్తున్న పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈలోపే జనగణమన కథ మెగాస్టార్ కు వినిపించాడట.
చిరు కూడా కథ బాగుందని చెప్పాడని టాక్.
దేశభక్తి కథతో వస్తున్న ఈ సబ్జెక్ట్ అసలైతే మహేష్ కోసం రాసుకున్నాడు పూరి. కాని మహేష్ కమిట్ అయిన సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉంది కాబట్టి అంతదాకా వెయిట్ చేయలేని పూరి వెంకటేష్ కు ఈ కథ వినిపించాడట. కాని బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు.
అదే కథ మీద ఇప్పుడు మెగాస్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. పూరి చెప్పిన ఆటో జానిని పక్కన పెట్టేసి తన ఇమేజ్ కు తగ్గట్టుగా జనగణమనని తయారు చేయమని చెప్పాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఈ ఆఫర్ నిజంగా లక్కీ ఛాన్స్ అన్నట్టే లెక్క. ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







