సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ పల్లెటూరి గేటప్ లో
- April 09, 2017
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ నేపద్య కధలతో సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అయ్యాడు.. ధృవ సినిమాతో సూపర్ హిట్ అందుకొన్న చరణ్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మరో విభిన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపద్యంలో సాగే పల్లెటూరి ప్రేమ కధ.. ఈ సినిమా షూటింగ్ ను 31 రోజుల పాటు గోదావరి జిల్లాల్లో చేయనున్నారు. రాజమండ్రి పరిశర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం లొకేషన్ లోని ఓ ఫోటోని చరణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో చరణ్ అచ్చమైన పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. పెంచిన గెడ్డం. లుంగీ, బనీన్ తో చరణ్ ఇది వరకూ ఎన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ ఒక్క ఫోటో తోనే సినిమాలో చరణ్ గెటప్ చాలా సహజంగా ఉండి సంథింగ్ స్పెషల్ అనిపిస్తోంది.. మరి సినిమాలో చరణ్ ను సుకుమార్ ఇంకెంత విభిన్నంగా చూపిస్తాడో మరి.. చరణ్ సరస సమంత హీరోయిన్ గా తొలిసారిగా నటిస్తోండగా.. ఆదిపినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







