బయట పడిన 14 వేల ఏళ్ల క్రితం ఊరు కెనడాలో
- April 10, 2017
భూమి మీద అనేక వింతలు విడ్డూరలు.. తవ్వే కొద్దీ బయట పడే అనేక నమ్మలేని నిజాలు.. ఆధునిక యుగంలో కనుగొన్నాం అని సంబర పడే అనేక విషయాలు పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయపడితే.. అదీ మన పూర్వీకుల గొప్పదనం అంటూ గొప్పలు చెప్పుకొంటాం.. అలాంటి ఆనవాళ్ళ కోసం పురాతత్వ శాస్త్ర వేత్తలు తవ్వకాలు జరుపుతుంటే.. మన పూర్వీకులు వాడిన మట్టి పాత్రలు, అలనాటి మనుషుల ఆనవాలు, ఆయుధాలు, వాడిన డబ్బులు, ఇళ్ల నిర్మాణ శైలి వంటివి బయల్పడుతూ ఉంటాయి.. కానీ తాజాగా కెనడా త్రిక్యూట్ ఐలాండ్ లోని బ్రిటిష్ కొలంబియా నార్త్ వెస్ట్ విక్టోరియా లో 14 వేల సంవత్సరాల క్రితం ఓ పురాతన గ్రామం బయటపడింది. ఈ గ్రామం ఈజిప్ట్ పిరమిడ్ల కంటే ముందు వెలసిన గ్రామంగా చెబుతున్నారు.. అంతేకాదు ఈ గ్రామం లో అప్పటివారు మంటలను లైటింగ్ సాధనంగా ఎలా వాడారు, చేపలు పట్టడానికి హుక్స్ తో కూడిన గేలం, ఈటెలను ఉపయోగించి వేటను ఎలా చేసే వారు అనేటువంటి విషయాలు పరిశోధనలో తెలిసాయి.. ఈ పురాతన తవ్వకాలకు విక్టోరియా యూనివర్సిటీ లోని హకాయ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన రీసెర్చ్ స్కాలర్ అలిషా గౌరు అనే ఆంత్రపాలజీ పీహెచ్ డీ స్టూడెంట్ ఎంతగానో సాయపడింది.. అలిషా అక్కడి మీడియాలో ఉత్తర అమెరికాలోని ప్రజల ఏ విధంగా మొదట్లో జీవించే వారు.. అనంతరం అక్కడ జీవన పరిణామాలు ఎలా మారాయి అనే విషయాలను స్పష్టంగా వెల్లడించింది. మానవుల వలసలు ఎక్కువగా బ్రిటిష్ కొలంబియా కోస్తల్ లైన్ లోనే జరిగాయని ఈ గ్రామం ద్వారా తెలుస్తోందని పురాతన శాస్త్ర వేత్తలు నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







