కస్సరత్ స్ట్రీట్‌లో డైవర్షన్
- April 10, 2017
అల్ కస్సరత్ స్ట్రీట్‌లో 600 మీటర్ల మేర పర్మనెంట్ డైవర్షన్ ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వస్తుంది. దోహా సౌత్‌లోని 22 కిలోమీటర్ల ఎక్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఈ డైవర్షన్‌ని అమల్లోకి తెచ్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కోఆర్డినేషన్‌తో న్యూ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్ ఛేంజ్‌ని డిజైన్ చేశారు. అల్ కస్సరత్ స్ట్రీట్ మరియు వాడి అబా సెలీల్ ప్రాంతానికి మధ్య యాక్సెస్ కోసం ప్రత్యామ్నాయ రూట్‌ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మ్యాప్‌ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వాహనదారులు మ్యాప్‌లో చూపిన విధంగా తమ వాహనాల్ని నడపవలసి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడికక్కడ సూచికల్ని ఏర్పాటు చేసినందున వాహనదారులు అన్నీ గమనించి వాహనాలు నడపాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడిపడం ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







