ఉన్మాదుల వేధింపుల పై బ్రిటన్‌లో ముస్లిం మహిళ సాహసం
- April 10, 2017
- ఉన్మాదుల వేధింపుల నుంచి
మరో ముస్లిం మహిళను రక్షించిన వైనం
పరమత విద్వేష భావాలున్న ఉన్మాదుల దాడిని తిప్పి గొట్టేందుకు బ్రిటన్‌లో ఓ ముస్లిం మహిళ ప్రదర్శించిన తెగువ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లండన్ మేయర్ ఓముస్లిం అయినప్ప టికీ ఆనగరంలోనూ అసహన భావాలు పెరిగిపోయాయి. బ్రిటన్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనూ ముస్లిం చిన్నారుల పట్ల వివక్ష కొనసాగుతోంది. హిజాబ్‌ను ( ముఖానికి ధరించే వస్త్రం ) తొలగిస్తే గానీ విధులకు హాజరుకావొద్దని ఓ ముస్లిం మహిళా ఉద్యోగిని ఓ సంస్థ యజమాని ఆదేశించగా బాధిత మహిళ గతేడాది స్థానిక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు లండన్ మహానగరంలో పెరిగిపోయాయి. తాజాగా, బర్మింగ్‌హామ్ నగరంలో అసహన భావాలను ప్రదర్శిస్తున్న ఉన్మాదుల వేధింపుల నుంచి సాటి ముస్లిం మహిళను మరో ముస్లిం మహిళ కాపాడిన సంఘటన ఇటీవల చోటుచేసుకున్నది. ఉన్మాదుల వేధింపులను తిప్పిగొట్టేందుకు ఆ మహిళ ప్రదర్శించిన సాహసం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే..
బర్మింగ్‌హామ్ వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ముస్లిం మహిళ హిజాబ్‌ను బలవంతంగా తొలగించేందుకు ఉన్మాదులు ప్రయత్నించారు. సఫియా ఖాన్ అనే మరో ముస్లిం మహిళ ఆ విషయాన్ని గమనించింది. అసహనా నికి లోనైన ఉన్మాదులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కామెంట్లు చేశారు.
అంతేగాకుండా, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ, సఫియా ఖాన్ ఏమాత్రం అధైర్యపడలేదు. చిరునవ్వుతో వారి కళ్లలో కళ్లుపెట్టి అలాగే చూస్తుండి పోయింది. దాంతో, ఆ ఉన్మాదులు అక్కడి నుంచి పలాయనమయ్యారు.
అటువైపుగా వెళ్తున్న ఓ జర్నలిస్ట్ అక్కడ జరిగిన సంఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







